సత్తా లేని గుత్తా - బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్
సత్తా లేని గుత్తా - బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్
నల్గొండ : సత్తా లేని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ ఫైర్ అయ్యారు. బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రెస్ మీట్స్ పెట్టి బీజేపీని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుని విమర్శిస్తున్నారని, బిజెపి పై బండి సంజయ్ యాత్ర పై అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని గుత్తా కు హితవుపలికారు. కేసీఆర్ మెప్పు కోసం బిజెపి పై బండి సంజయ్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా కండిస్తున్నామన్నారు. టిడిపి అధికారంలో ఉంటే టిడిపిలోకి, కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ లోకి, టిఆర్ఎస్ అధికారంలో ఉంటే టిఆర్ఎస్ లోకి వెళ్లిన నీచ చరిత్ర గుత్తాదని అన్నారు. గుత్తా పదవుల కోసం ఆయన కొడుకు, వియ్యంకులకు కాంట్రాక్టు లకోసం పదవులు మారుతాడని రాజకీయ జీవితంలో ఎపుడైనా రోడ్డులెక్కి ఉద్యమం చేశావా? త్యాగాలు చేసిన చరిత్ర ఉందా నీకు అని గుత్తాను నిలదీశారు. రాజకీయ పదవులు కావాలంటే కేసీఆర్ కు భజన, ఆయన కొడుకు కు భజన, ఆయన మనుమడికి భజన చేసుకో మాకు అభ్యంతరం లేదని, బీజేపీ జోలికి వస్తే మాత్రం ఊరుకోమని నిప్పులు చెలిగారు. మదర్ డైరీ కోసం పార్టీలు మారి మూడు దశబ్ధాలలో మదర్ డైరీ ని దివాలా తీయించిన ఘనమైన చరిత్ర గుత్తా దే నని దుయ్యబట్టారు. ఇపుడు మదర్ డైరీ పదవి కోసం కేసీఆర్ మెప్పు పొందడానికి వారానికోసారి ప్రెస్ మీట్లు పెట్టి బిజెపి ని తిడుతున్నాడని బీజేపీ జోలికి వస్తే ఊరుకోం జాగ్రత్త అని హెచ్చరించారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి బీజేపీ కి ఏమి సంభందం అని గుత్తా అంటున్నారని, విలీనమంటే స్వచ్చందంగా కలిసేదానని అంటరాని, నిజం రజాకార్ల విద్వంస కాండ నుండి సర్దార్ వల్లబ్బాయ్ పటేల్ తోనే తెలంగాణ విమోచన అయ్యిందని, రజాకార్ల ఆగడాలు పానగల్ వెళ్లి చూస్తే గుత్తాకు అర్థం అవుతుందని, నంది ఉగ్రహాలు వినాయక విగ్రహాలు ద్వంసం అయిన విషయం తెలుస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశం లో మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి పోతేపాక సాంబయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేకేర్, జిల్లా ఆఫీస్ కార్యదర్శి చింతా ముత్యాల్ రావు, జిల్లా అధికార ప్రతినిధి భూపతి రాజు, పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వర్ రావు, బీజేపీ నాయకులు రావిరాల వెంకటేశ్వర్లు, కంకణాల నాగిరెడ్డి, గుర్రం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Post a Comment