రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలపైన పరువు నష్టం దావా దాఖలు చేసిన మంత్రి కేటీఆర్


రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలపైన పరువు నష్టం దావా దాఖలు చేసిన మంత్రి కేటీఆర్


హైదరాబాద్


- *తనకు సంబంధం లేని అంశాల్లో దురుద్దేశపూర్వకంగా తన పేరును వాడుతున్నారన్న కేటీఆర్* 


- *తనపై అసత్య ప్రచారం చేస్తున్న నిందితులను కోర్టు శిక్షిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్*


రాజకీయ దురుద్దేశంతో, అసత్యాలను అబద్దాలను ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కె.తారకరామారావు సిటీ సివిల్ కోర్టు లో పరువు నష్టం కేసును  దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా తనపైన అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని, ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేకున్నా, రేవంత్ రెడ్డి దురుద్దేశ పూర్వకంగా తన పేరును వాడుకుంటున్నారని, దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల కలిగిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని సైతం ప్రారంభించాలని కేటీఆర్ కోరారు.  గౌరవ న్యాయస్థానం తనపై రేవంత్ చేస్తున్న అసత్య ప్రచారాలను గుర్తించి, ఇలాంటి దురుద్దేశ కార్యక్రమాలకు పాల్పడుతున్న నిందితులను తగిన విధంగా శిక్షిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ అన్నారు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్