*ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన దంపతులు*
*ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన దంపతులు*
నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన కత్తుల ప్రమోద్ కుమార్ మరియు కత్తుల మెర్సీ గ్రేస్దంపతులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగింది. కత్తుల ప్రమోద్ కుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండ మల్లేపల్లి లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు అలాగే కత్తుల మెర్సీ గ్రేస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల) దేవరకొండ లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా వీరు అవార్డులు స్వీకరించారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినందుకు విద్యాశాఖ అధికారులకు దంపతులు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Post a Comment