మందు పోస్తే నే వార్తల షేరింగ్ లేదంటే గ్రూప్ నుండి రెమూవ్ నల్లగొండ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల తీరు
మందు పోస్తే నే వార్తల షేరింగ్
లేదంటే గ్రూప్ నుండి రెమూవ్
నల్లగొండ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల తీరు
నల్గొండ: మందు పార్టీ ఇస్తేనే వార్తలు షేర్ చేస్తాం లేదంటే వాట్సాప్ గ్రూప్ నుండి రిమూవ్ చేస్తాం అంటున్న నల్గొండ జిల్లా జిల్లా సమాచార శాఖ అధికారుల తీరు. నేను మొనర్కునని, చిన్న మరియు మధ్యతరహా పత్రికలు పనికి రావని పలు సందర్భాల్లో ఆ మోనార్క్ పేలడం ఆనవాయితీగా వస్తోంది. ఆ మోనార్క్ జిల్లా కు వచ్చి దాదాపు 4 యేండ్లు అవుతుంది. వచ్చిన దగ్గర నుండి ఆ కార్యాలయ ఉద్యోగులను వేదించడంతో వారంతా కలసి కలెక్టర్ కు కమీషనర్ కు మొరపెట్టుకున్న ఎలాంటి విచారణ, మందలింపు లేకపోడంతో ఇంకా రెచ్చిపోయిన ఆ మోనార్క్. ప్రభుత్వ కార్యక్రమాలు అభివృద్ధి కార్యములు వివరాలను జిల్లా ప్రజలకు చేరవేసే ప్రింట్ మీడియా కు , ఎలక్ట్రానిక్ మీడియాకు అందచేయాల్సిన బాధ్యత ఆ మోనార్క్ పై ఉంది. కానీ చిన్న మధ్యతరగతి మీడియా కు మాత్రం మందు పార్టీ ఇస్తేనే వార్తలు వాట్సాప్ లో షేర్ చేస్తా. లేకుంటే వాట్సాప్ గ్రూప్ నుండి రెమూవ్ చేస్తా అని ఢంకా బజాయించిన ఆ మ్మోనర్క్ నిజంగానే వాట్సాప్ గ్రూప్ నుండి మా ప్రతినిధి ని రెమూవ్ చేశారు. ఈ విషయాన్ని జోనల్ అధికారి ఆయిన జాయింట్ డైరెక్టర్ కు మా ప్రతినిధి తెలుపుతూ వార్త లు ఇప్పించామని కోరుతూ లేఖ పంపడం తో జాయింట్ డైరెక్టర్ వార్తలు పంపండి అని ఆ మోనార్క్ కు మెమో పసంపారు. కొన్ని రోజులు మెయిల్ ద్వారా పంపి, ఆ తర్వాత కుక్కతోక వంకర లాగా పంపడం మానేశారు. పై అధికారుల మాట కూడా లెక్క చేయకుండా వికృతంగా పప్రవర్తిస్తున్న ఆ మోనార్క్ పై చర్యలు తీసుకుని, వార్తలు వాట్సాప్ గ్రూపు ద్వారా పంపాలని ఆ మోనార్క్ పై చట్ట పరమైన చర్యలకు మా ప్రతినిధి సిద్ధమౌతున్నారు. ఆఫీస్ కు వచ్చే బడ్జెట్ ను అక్రమంగా డ్రా చేస్తున్నారని, అక్రమంగా ఆదాయపు పన్ను మినహాయింపు పొందరన్న గుసగుసలు పై మరియు ఆ మోనార్క్ అధికార దుర్వినియోగాలపై దృష్టి సారించిన మా ప్రతినిధి అన్ని వివరాలు త్వరలో.
Comments
Post a Comment