వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి - రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ
వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి - రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. వక్ఫ్ భూముల రక్షణకు సంబందించి చేపట్టాల్సిన చర్యలపై సోమవారం నాడు తన కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం, సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, వక్ఫ్ బోర్డ్ సీఈఓ షావానాజ్ ఖాసిం తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ మరియు అనధికార ఆక్రమణల తొలగింపు కోసం సకాలంలో చర్యలు తీసుకోవాలని అధికారులతో అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులపై తాజా సమాచారాన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షానవాజ్ ఖాసిం సమావేశంలో తెలియజేశారు మరియు వక్ఫ్ బోర్డు బాగా పనిచేస్తోందని చెప్పారు. వక్ఫ్ బోర్డులో సిబ్బంది తక్కువగా ఉన్నారని, ఈ విషయంలో ఉన్నతాధికారులకు నివేదంచానని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డులో ఆఫీసర్ స్థాయి సిబ్బంది తక్కువగా ఉన్నారని ప్రభుత్వం ఆఫీసర్ పోస్టులకు కేటాయిస్తే వక్ఫ్ బోర్డు పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని ఆయన అన్నారు. వక్ఫ్ ఆస్తులను అనధికారికంగా ఆక్రమించడాన్ని తెలంగాణ ప్రభుత్వం సహించదని చెప్పారు. వక్ఫ్ ఆస్తిని కాపాడటానికి, వక్ఫ్ బోర్డు సిబ్బందికి అవసరమైన విధంగా సహకరించాలని సంబంధిత విభాగాలైన రెవెన్యూ, మున్సిపాలిటీ మరియు పోలీసు సిబ్బందిని ఆదేశించారు . వక్ఫ్ బోర్డ్‌లో సిబ్బంది నియామక సమస్య, ముఖ్యంగా ఆఫీసర్ స్థాయి అధికారుల నియామకం విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గుట్టల బేగంపేట వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
Comments
Post a Comment