*ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : సిఐ చంద్ర శేఖర్ రెడ్డి*
*ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : సిఐ చంద్ర శేఖర్ రెడ్డి*
- - టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన
నల్లగొండ : ఆటో డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండడంతో పాటు వాహనాలు నడిపే సమయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలి టూ టౌన్ సిఐ చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు.
సోమవారం టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులుతో కలసి క్లాక్ టవర్ సెంటర్ లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలలో పరిమితి ప్రకారం ప్రయాణికులను ఎక్కించుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని చెప్పారు. ప్రమాదాల నివారణకు కృషి చేయడంతో పాటు ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రధాన్యత ఇస్తూ వారిని గమ్యస్థానాలకు చేర్చాలని ఆయన సూచించారు. ప్రమాదాలను నివారించే చర్యలలో ఆటో డ్రైవర్ల భాగస్వామ్యం చాలా ప్రధానమైనదని అందువల్ల ఆటో డ్రైవర్లంతా విధిగా నిబంధనలు పాటిస్తూ సహకరించాలన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు లైసెన్స్, ఇన్సూరెన్స్ లాంటి పేపర్లతో పాటు అన్ని రకాల ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు, ఆటో యూనియన్ ప్రతినిధులు, టూ టౌన్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Comments
Post a Comment