బిజెవైఎమ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కంచర్ల దిష్టి బొమ్మ దహనం



 


 బిజెవైఎమ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కంచర్ల దిష్టి బొమ్మ దహనం

నల్గొండ : భారత ప్రధాని నరేంద్ర మోడీ  దేశం కోసం దేశ ప్రజల క్షేమం కోరుతు  ఎన్నో  కార్యక్రమాలు చేస్తూ ప్రపంచ దేశాలు లచే కీర్తింప పడుతున్న ప్రధానిని అధికార మదం తో నల్గొండ  ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రధాని పై చేసిన విమర్శలను వెనక్కి తీసుకొని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని   డిమాండ్ చేస్తూ నల్గొండ బీజేవైఎం ఆధ్వర్యంలో
 బస్టాండ్ దగ్గర గల నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహం వద్ద  ఎమ్మెల్యే కంచర్ల  దిష్టిబొమ్మను దహనం చేశారు.  బిజెవైఎమ్ జిల్లా అధ్యక్షులు ఐతరాజు సిద్దు  మాట్లాడుతూ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేతగాని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని లేదంటే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసి యువమోర్చా నాయకులు నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటిని  ముట్టడిస్తామని  హెచ్చరించారు.
 బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నూకల నరసింహారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండార్ ప్రసాద్, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ రైతు చట్టాల మీద అవగాహన లేకుండా ఎమ్మెల్యే కంచర్ల  ప్రదానిపై  వాఖ్యలు చేశారని విమర్ధిస్తూ  వ్యవసాయ చట్టాలపై చర్చలకు  రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి  కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, జిల్లా అధికార  ప్రతినిధి భూపతి రాజు, దాయం భూపాల్ రెడ్డి, బీజేవైఎమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి  మానుక వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు  సైదులు, మండల అధ్యక్షుడు అనీల్, పట్టణ అధ్యక్షుడు సాయి,  కనగల్ మండల అధ్యక్షుడు దుర్గ,   బలరాం, కాశమ్మ,  లక్ష్మీ ప్రసన్న,   యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్