పవిత్ర స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజాస్వామ్యం పై దాడి - జాట్ రాష్ట్ర అధ్యక్షుడు పగడాకుల
పవిత్ర స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజాస్వామ్యం పై దాడి - జాట్ రాష్ట్ర అధ్యక్షుడు పగడాకుల
పవిత్ర స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజాస్వామ్యం పై దాడి జరిగిందని జాట్ రాష్ట్ర అధ్యక్షుడు పగడాకుల బాలాస్వామి అన్నారు ప్రజల చేత ఎన్నుకోబడిన మల్కాజ్గిరి కార్పొరేటర్ పై టిఆర్ఎస్ దాడికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని, 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవ సంబరాలు సందర్భంగా దేశమంతా "ఆజాది క అమృత్ మహోత్సవ్" కార్యక్రమాలు జరుగుతున్న శుభ వేళ మల్కాజ్గిరి లో దాష్టికం రాజ్యమేలిందని ఆయన విమర్శించారు. తోటి ప్రజా ప్రతినిధిని గౌరవించలేని స్థాయిలో స్థానిక మల్కాజ్గిరి శాసనసభ్యుడి వ్యవహారం, ఆయన మాట్లాడే భాషను విని సభ్య సమాజం నివ్వెరపోయిందని, దాడులు, దౌర్జన్యాలను ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని, జాతీయ జెండాను గౌరవించడం కార్పొరేటర్ వంతైతే.. రెచ్చిపోయిన గుండాలు కింద పడేసి తొక్కి ముష్టి గాతులు.. పిడి గుద్దులు గుద్ధి.. ఇనుప రాడ్లు.. కర్రలతో దాడికి తెగబడటము గుండాల వంతయిందని అన్నారు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో బతికి బయటపడ్డ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ను మల్కాజ్గిరి జిల్లా ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు.
Comments
Post a Comment