Posts

Showing posts from August, 2021

*ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : సిఐ చంద్ర శేఖర్ రెడ్డి*

Image
 *ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : సిఐ చంద్ర శేఖర్ రెడ్డి* - - టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన నల్లగొండ : ఆటో డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండడంతో పాటు వాహనాలు నడిపే సమయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలి టూ టౌన్ సిఐ చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులుతో కలసి క్లాక్ టవర్ సెంటర్ లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలలో పరిమితి ప్రకారం ప్రయాణికులను ఎక్కించుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని చెప్పారు. ప్రమాదాల నివారణకు కృషి చేయడంతో పాటు ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రధాన్యత ఇస్తూ వారిని గమ్యస్థానాలకు చేర్చాలని ఆయన సూచించారు. ప్రమాదాలను నివారించే చర్యలలో ఆటో డ్రైవర్ల భాగస్వామ్యం చాలా ప్రధానమైనదని అందువల్ల ఆటో డ్రైవర్లంతా విధిగా నిబంధనలు పాటిస్తూ సహకరించాలన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు లైసెన్స్, ఇన్సూరెన్స్ లాంటి పేపర్లతో పాటు అన్ని రకాల ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు, ఆట...

వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి - రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ

Image
   వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు  ప్రభుత్వం తీవ్రంగా  కృషి - రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా  కృషి చేస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు.  వక్ఫ్ భూముల రక్షణకు సంబందించి చేపట్టాల్సిన చర్యలపై సోమవారం నాడు తన కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం, సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర,  జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, వక్ఫ్ బోర్డ్ సీఈఓ షావానాజ్  ఖాసిం తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర   ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.     రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ మరియు అనధికార ఆక్రమణల తొలగింపు కోసం సకాలంలో చర్యలు తీసుకోవాలని అధికారులతో అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులపై తాజా సమాచారాన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షానవాజ్ ఖాసిం సమావేశంలో తెలియజేశ...

బిజెవైఎమ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కంచర్ల దిష్టి బొమ్మ దహనం

Image
   బిజెవైఎమ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కంచర్ల దిష్టి బొమ్మ దహనం నల్గొండ : భారత ప్రధాని నరేంద్ర మోడీ  దేశం కోసం దేశ ప్రజల క్షేమం కోరుతు  ఎన్నో  కార్యక్రమాలు చేస్తూ ప్రపంచ దేశాలు లచే కీర్తింప పడుతున్న ప్రధానిని అధికార మదం తో నల్గొండ  ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రధాని పై చేసిన విమర్శలను వెనక్కి తీసుకొని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని   డిమాండ్ చేస్తూ నల్గొండ బీజేవైఎం ఆధ్వర్యంలో  బస్టాండ్ దగ్గర గల నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహం వద్ద  ఎమ్మెల్యే కంచర్ల  దిష్టిబొమ్మను దహనం చేశారు.  బిజెవైఎమ్ జిల్లా అధ్యక్షులు ఐతరాజు సిద్దు  మాట్లాడుతూ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేతగాని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని లేదంటే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసి యువమోర్చా నాయకులు నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటిని  ముట్టడిస్తామని  హెచ్చరించారు.  బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నూకల నరసింహారెడ్డి, మున్సిపల్ ఫ...

శ్రీ శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులుగా నేతి రఘుపతి

Image
  శ్రీ శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ సమితి   అధ్యక్షులుగా నేతి రఘుపతి నల్గొండ: శ్రీ శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ సమితి  అధ్యక్షులుగా ప్రముఖ న్యాయవాది  నేతి రఘుపతి  ఎన్నికైనారు.  బుధవారం  స్థానిక సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో  ఆయనను  ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్  విభాగ్ సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య, విభాగ్ ప్రచారక్  నర్రా వెంకట శివకుమార్, జిలా సంఘచాలాక్  ఇటికాల క్రిష్ణయ్య, పల్లెబోయిన  శ్యామసుందర్,  నన్నూరి రాంరెడ్డి,  గోలి మధుసూదన్ రెడ్డి,  వీరెల్లి చంద్రశేకేర్,  కర్నాటి యాదగిరి, యదగిరాచారి, కాశమ్మ,  ఉత్సవ సమితి మాజీ  అధ్యక్షులు  రవికుమార్ లు పాల్గొన్నారు.   ప్రధాన కార్యదర్శులుగా మామిడి శ్రవణ్ కుమార్, కన్నేబోయిన వెంకట్, కోశాధికారిగా వనమా మనోహర్,  మరియు ఇతర కార్యవర్గాన్ని అధ్యక్షుడు రఘుపతి ప్రకటించారు. 

పవిత్ర స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజాస్వామ్యం పై దాడి - జాట్ రాష్ట్ర అధ్యక్షుడు పగడాకుల

Image
  పవిత్ర స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజాస్వామ్యం పై దాడి  - జాట్ రాష్ట్ర అధ్యక్షుడు పగడాకుల పవిత్ర స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజాస్వామ్యం పై దాడి జరిగిందని జాట్ రాష్ట్ర అధ్యక్షుడు పగడాకుల బాలాస్వామి అన్నారు   ప్రజల చేత ఎన్నుకోబడిన మల్కాజ్గిరి కార్పొరేటర్ పై టిఆర్ఎస్ దాడికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని,  75 వసంతాల స్వాతంత్ర దినోత్సవ సంబరాలు సందర్భంగా దేశమంతా "ఆజాది క అమృత్ మహోత్సవ్" కార్యక్రమాలు జరుగుతున్న శుభ వేళ మల్కాజ్గిరి లో దాష్టికం రాజ్యమేలిందని ఆయన  విమర్శించారు. తోటి ప్రజా ప్రతినిధిని గౌరవించలేని స్థాయిలో స్థానిక మల్కాజ్గిరి శాసనసభ్యుడి  వ్యవహారం, ఆయన మాట్లాడే భాషను విని సభ్య సమాజం నివ్వెరపోయిందని,  దాడులు,  దౌర్జన్యాలను ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని, జాతీయ జెండాను గౌరవించడం కార్పొరేటర్ వంతైతే.. రెచ్చిపోయిన గుండాలు కింద పడేసి తొక్కి ముష్టి గాతులు.. పిడి గుద్దులు గుద్ధి.. ఇనుప రాడ్లు.. కర్రలతో దాడికి తెగబడటము గుండాల వంతయిందని అన్నారు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో బతికి బయటపడ్డ  మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ను మల...

నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా భూపతి రాజు

Image
 నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా  భూపతి రాజు నల్గొండ : నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి గా నల్గొండ పట్టణాన వాసి సీనియర్ కార్యకర్త    భూపతి రాజును బీజేపీ జిల్లా అధ్యక్షులు  కంకణాల శ్రీధర్ రెడ్డి నియమించారు. పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి పార్టీ అభివృద్ధి కి  తోడ్పడాలని ఆయన కోరారు. తన ను  నియమించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి గారికి మరియు  నియమానికి సహకరించిన నాయకులకు  భూపతి రాజు కృతజ్ఞతలు తెలుపుతు,  పార్టీ నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని   పేర్కొన్నారు