అధిక ఫీజులు వసూలు చేస్తున్న మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాల పై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

 

అధిక ఫీజులు వసూలు చేస్తున్న మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాల పై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

నేడు నల్గొండ నగరంలోని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్  నిగిదాల సురేష్  నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగిందని అలాగే సి.ఐ  సానుకూలంగా స్పందించడం జరిగిందని ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూడా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు మానవతా దృక్పథం లేకుండా విచ్చలవిడిగా వివిధ రకాల పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని,వీటి కట్టడికి ప్రభుత్వం జీవోలు ఇచ్చినా కూడా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ, బెదిరింపులకు గురి చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరమని అన్నారు. మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాలల పై అధిక ఫీజుల విషయంలో గతం నుండి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనక ఏదో దాగి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల సంపత్ కుమార్, ఎన్జి కళాశాల అధ్యక్షులు నరసింహారెడ్డి, ఎన్జి కళాశాల ఉపాధ్యక్షుడు కట్ట హరిబాబు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్