Posts

Showing posts from June, 2021

అధిక ఫీజులు వసూలు చేస్తున్న మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాల పై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Image
  అధిక ఫీజులు వసూలు చేస్తున్న మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాల పై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నేడు నల్గొండ నగరంలోని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్  నిగిదాల సురేష్  నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగిందని అలాగే సి.ఐ  సానుకూలంగా స్పందించడం జరిగిందని ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూడా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు మానవతా దృక్పథం లేకుండా విచ్చలవిడిగా వివిధ రకాల పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని,వీటి కట్టడికి ప్రభుత్వం జీవోలు ఇచ్చినా కూడా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ, బెదిరింపులకు గురి చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరమని అన్నారు. మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లా ...

కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీ అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి -ఎబివిపి

Image
 కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీ అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి  -ఎబివిపి  రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది జీవితాలపై తీవ్ర ప్రభావం పడి ఇబ్బందులకు గురయ్యారని ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు* అన్నారు. స్థానిక ఏచూరీ శ్రీనివాస్ స్మారక భవనం ఎబివిపి  కార్యాలయంలో జరిగిన విలేకరుల  సమావేశంలో ఎబివిపి నాయకులు మాట్లాడుత కార్పొరేటు, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని  డిమాండ్ చేశారు. ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్న అనేక మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన పేద మధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడ్డ ఈ విపత్కర పరిస్థితుల్లో కార్పొరేట్, ప్రైవేట్ మరియు ఇంటర్ నేషనల్  స్కూల్స్, కళాశాలలు  ఆన్లైన్ క్లాసుల పేరిట అధిక  ఫీజుల దోపిడీతో  తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తూ కష్ట కాలంలో కాసుల కక్కుర్తితో మరింత ఆందోళనలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి  మీడియా సమావేశం...