మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి కలిసిన చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు.


గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి   గారిని  కలిసిన చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు.


తెలంగాణ స్మాల్ మీడియం  న్యూస్ పేపర్స్ మరియు  మ్యాగజైన్స్ అసోసియేషన్   అధ్యక్షులు  యూసుఫ్ బాబు  గారి ఆధ్వర్యంలో   నేడు అనగాతేదీ  31.12. 2020 న బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో గల   మినిస్టర్స్  క్వార్టర్స్  నందు  తెలంగాణ రాష్ష్ట్ర  విద్యుత్ శాఖ  మంత్రి వర్యులు   గుంట  కండ్ల జగదీశ్వర్ రెడ్డి  ని వారి   నివాసంలో   కలిసి  చిన్న పత్రికల సమస్యల పై వివరించడం జరిగింది.  ముఖ్యంగా ప్రతి నెల ప్రకటనలు లేక  చిన్న పత్రికలు  దయనీయ స్థితి లో ఉన్నాయని, కావున చిన్న పత్రికలకు  ప్రతినెలా ప్రకటనలు విడుదల చేసి ఆదుకునేలా మా సమస్యను  సీఎం గారి దృష్టి కి తీసుకెళ్లాల్సిందిగా  కోరడం జరిగింది. నల్లగొండ జిల్లాలో చిన్న పత్రికలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని, పెద్ద పత్రికలలో పనిచేసి వివిధ  కారణాలతో మానివేసి ప్రాంతీయ పత్రికలు పెట్టుకున్నారని, డబుల్ బెడ్రూంలు, ఇళ్ల స్థలాలు చిన్న పత్రికల ఎడిటర్లకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అన్ని విషయాలు జగదీశ్వర్ రెడ్డి గారికి వివరంగా వివరించగా  సానుకూలంగా స్పందిస్తూ  సీఎం గారి  దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్