Posts

Showing posts from December, 2020

మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి కలిసిన చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు.

Image
గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి   గారిని  కలిసిన చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు. తెలంగాణ స్మాల్ మీడియం  న్యూస్ పేపర్స్ మరియు  మ్యాగజైన్స్ అసోసియేషన్   అధ్యక్షులు  యూసుఫ్ బాబు  గారి ఆధ్వర్యంలో   నేడు అనగాతేదీ  31.12. 2020 న బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో గల   మినిస్టర్స్  క్వార్టర్స్  నందు  తెలంగాణ రాష్ష్ట్ర  విద్యుత్ శాఖ  మంత్రి వర్యులు   గుంట  కండ్ల జగదీశ్వర్ రెడ్డి  ని వారి   నివాసంలో   కలిసి  చిన్న పత్రికల సమస్యల పై వివరించడం జరిగింది.  ముఖ్యంగా ప్రతి నెల ప్రకటనలు లేక  చిన్న పత్రికలు  దయనీయ స్థితి లో ఉన్నాయని, కావున చిన్న పత్రికలకు  ప్రతినెలా ప్రకటనలు విడుదల చేసి ఆదుకునేలా మా సమస్యను  సీఎం గారి దృష్టి కి తీసుకెళ్లాల్సిందిగా  కోరడం జరిగింది. నల్లగొండ జిల్లాలో చిన్న పత్రికలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని, పెద్ద పత్రికలలో పనిచేసి వివిధ  కారణాలతో మానివేసి ప్రాంతీయ పత్రికలు పెట్టుకున్నారని, డబుల్ బెడ్రూంలు, ఇళ్ల స్థలాలు చిన్న ...

మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం

Image
  మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం సోమవారం 14న నల్గొండలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం నల్గొండ  పట్టణ ప్రజలచే నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు గంగడి మనోహర్ రెడ్డి, కంకణాల శ్రీధర్ రెడ్డి,  మాదగోని శ్రీనివాస్  గౌడ్, ఒరుగంటి రాములు, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, నూకల నరసింహ రెడ్డి, శ్రీ రామోజు షణ్ముఖ, బండారు ప్రసాద్, పల్లెబోయిన శ్యామ్ సుందర్, నూకల  వెంకట నారాయణ రెడ్డి లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే నని భారీ సంఖ్యలో హాజరై  విజయవంతం చేయగలరని కోరారు.