దుబ్బాకలో బీజేపీ గెలుపు తెలంగాణలో బీజేపీ కి పెరిగిన ఆదరణ కు నిదర్శనం - నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి


దుబ్బాకలో బీజేపీ గెలుపు   తెలంగాణలో బీజేపీ కి పెరిగిన ఆదరణ కు నిదర్శనం అని తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అన్నారు.  టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసి పోలీస్ లను తమ కార్యకర్తల పై వుపయోగించిన ప్రజలు బిజెపిని ఆదరించారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అన్నారు.
దేశంలో కూడా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని నరేంద్ర మోడీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని,వచ్చే  గ్రేటర్ హైదరాబాద్ మరియు శాసన సభ ఎన్నికలో బీజేపీదే విజయం అని ఆయన అన్నారు.
బీజేపీ కార్యాలయంలో పెద్దఎత్తున బాణసంచా కాల్చారు.కార్యాలయంలో   స్వీట్స్ పంపిణీ చేశారు.కార్యాలయం నుండి పెద్దఎత్తున కార్యకర్తలు సుభాష్ బొమ్మ వరకు ఊరేగింపు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి,గోలి మధుసూదన్ రెడ్డి,నిమ్మల రాజశేఖర్ రెడ్డి,పోతేపక లింగస్వామి,శ్రీనివాస్ రెడ్డి,కంచర్ల విద్యాసాగర్ రెడ్డి,కూతురు లక్ష్మ రెడ్డి,చింత ముత్యాలరావు,షేక్ పాషా,కొండ భవాని ప్రసాద్,నీరజ, కాశమ్మ,విజయలక్ష్మి,తథితరులు పాల్గొన్నారు.


 


Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్