ప్రతి చివరి రైతుకు టోకెన్ అందచేస్తాం,రైతులు టోకెన్ ల కొరకు తొందర పడవద్దు, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్


ప్రతి చివరి రైతుకు టోకెన్ అందచేస్తాం రైతులు టోకెన్ ల కొరకు తొందర పడవద్దు, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్


 


నల్గొండ,నవంబర్ 12.సన్న రకం వరి ధాన్యం రైతులు టోకెన్ ల జారీ కొరకు తొందరపడ వద్దని,ప్రతి చివరి రైతుకు టోకెన్ లు అందచేస్తామని, మద్దతుధరకు ధాన్యం కొనుగోలు చేయానున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.టోకెన్ ల జారీ కి ఎటువంటి పరిమితి లేదని,రైతుల కు వచ్చే రెండు నెలలు వరకు టోకెన్ ల జారీకి వెసులుబాటు కల్పించ నున్నట్లు తెలిపారు.మిర్యాలగూడలో మిల్లులు సామర్థ్యం బట్టి ప్రతి రోజు మిల్లులు ధాన్యం దిగుబడి చేసుకొనే సంఖ్య లో టోకెన్ లు జారే చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు,అందరికీ ఒకే సారి టోకెన్ లు జారీ చేయడం సాధ్యం కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు టోకెన్ జారీ తర్వాత వరి కోత లు చేసి ధాన్యం తీసుకు రావాలని,వేచి ఉండకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. సన్నరకం ప్రైవేట్ రకాలు(జై శ్రీ రాం, చింటూ,హెచ్.ఎం.టి.,పూజ)తేమ శాతం తక్కువ ఉంటే మిల్లర్ లు కొనుగోలు చేయరని అపోహ ఉందని,రైతులు ఆరబెట్టుకొని 17 శాతం కన్నా తేమ తక్కువ ఉన్నా ధాన్యం మిల్లర్ లు కొనుగోలు చేయడం జరుగుతుందని, మంచి ధర రైతుకు లభిస్తుందని అన్నారు. రైతులు తొందర పడి ఎక్కువ సంఖ్యలో ఒకే సారి వస్తే రద్దీ ఏర్పడుతుందని,నాలుగు రోజుల్లో రద్దీ తగ్గుతుందని అన్నారు. క్రమ బద్దీకరణ విధానం లో టోకెన్ జారీ చేయడం వలన ప్రస్తుతం ట్రాక్టర్ ల రద్దీ లేదని ఒక పూట లోపల ధాన్యం దిగుబడి చేసుకుని ట్రాక్టర్ క్లియర్ చేయడం జరుగుతుందని, గతం లో 3,4 రోజులు ట్రాక్టర్లు వేచివుండడం వలన రైతులకు కిరాయి ఖర్చులు నష్టం జరిగేదని,రైతులందరూ క్రమబద్దీకరణ విధానం పాటిస్తూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్