గాంధేయ పద్ధతులో నిరసన తెలుపుతుంటే అరెస్టులు సిగ్గుచేటు-జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, నిమ్మల రాజశేఖర్ రెడ్డి
గాంధేయ పద్ధతులో నిరసన తెలుపుతుంటే అరెస్టులు సిగ్గుచేటు-జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి,
నిమ్మల రాజశేఖర్ రెడ్డి
నల్గొండ : తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ ధోరణి కి అప్రజాస్వామిక పద్ధతులను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త గంగలశ్రీనివాస్ ఆత్మహత్య కు నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టినందుకు నల్లగొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకుల అరెస్టులు శోచనీయం. ప్రజాస్వామ్యములో కనీసం నిరసన తెలిపే హక్కు కూడా తెలంగాణ ప్రభుత్వం లేకుండా చేయడం సిగ్గుచేటు. జిల్లాలో పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా ప్రవర్తించి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం అప్రజాస్వామిక చర్య. గాంధేయ పద్ధతులో నిరసన తెలుపుతుంటే అరెస్టులు సిగ్గుచేటని, భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా కండిస్తుందని నల్లగొండ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి,
నిమ్మల రాజశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Post a Comment