గంగుల శ్రీనివాస్ కు ఘనా నివాళి బీజేపీ నల్గొండ పట్టణ శాఖ.
గంగుల శ్రీనివాస్ కు ఘనా నివాళి
బీజేపీ నల్గొండ పట్టణ శాఖ.
నల్లగొండ పట్టణంలోని స్థానిక పెద్ద గడియారం సెంటర్ లో బీజేపీ నల్లగొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీనివాస్ మృతి కి సంతాపం గా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్ నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఏదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ మృతి చెందడం చాల భాదాకారం అని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దని రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రo లో బీజేపీ ప్రభుత్వ ఏర్పడుతుంది అని కార్యకర్తలు ప్రభుత్వం తీరును ఏప్పటికప్పుడు ఏoడగట్టాలని అన్నారు అలాగే గంగుల శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని అన్నారు నల్గొండ భారతీయ జనతాపార్టీ పట్టణ శాఖ బీజేపీ నాయకులు కార్య కర్తలు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మోరిశెట్టి నాగేశ్వర్ రావు , పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్, జిల్లా నాయకులు చింత ముత్యాలరావు, బొజ్జ శేఖర్, వంగూరి రాఖీ, గుర్రం వెంకన్న,పట్టణ నాయకులు మంగల్ పల్లి కిషన్, పొగాకు నాగరాజు, పగిడి మహేష్,అక్కనపల్లి బలరాం,భవాని,యాదగిరి,వంశీ,కొండల్,శ్యామ్, తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment