Posts

Showing posts from November, 2020

ఉప్పల ను సత్కరించిన వల్లంబొట్ల

Image
ఉప్పల ను సత్కరించిన వల్లంబొట్ల ఇంటర్నేషనల్ వైశ్య  ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు  తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శుభ   సందర్బంగా  వారిని శ్రీ వాసవీమాత దర్శిని  ఎడిటర్ వల్లంబొట్ల శ్రీనివాసరావు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఉప్పల శ్రీనివాస్ గుప్త  గారి ఆధ్వర్యంలో  తెలంగాణ టూరిజం రంగం మరింత అభివృద్ధి చెందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు .  భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు ఉప్పల శ్రీనివాస్ గుప్త  చేపట్టాలని  మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా  ఆయన కోరుకున్నారు

MLC గా ఎంపికైన బొగ్గారపును సత్కరించిన వల్లంబొట్ల

Image
  తెలంగాణ గవర్నర్ కోటాలో నామినేటెడ్ శాసనమండలి సభ్యులుగా ఎంపికైన బొగ్గారపు దయానంద్ ను శ్రీ వాసవీ మాత దర్శిని ఎడిటర్ వల్లంబొట్ల శ్రీనివాసరావు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్యవైశ్యలను ఎంపిక చేసిన కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు వబిలిశెట్టి

Image
ఆర్యవైశ్యలను ఎంపిక చేసిన కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ  మాజీ అధ్యక్షుడు వబిలిశెట్టి దయానంద్ ని ఎమ్మెల్సీ గాను  లక్ష్మీ నారాయణ ని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్గా ఉప్పల శ్రీనివాస్ ని తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గాను నియమించిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కు  ధన్యవాదములు తెలిపిన ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ  మాజీ అధ్యక్షుడు వబిలిశెట్టి కనకరాజు,  ఎంపికైన మిత్రులు ముగ్గురికి  హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ చైర్మన్గా ఆర్యవైశ్య నాయకుడు అమరావతి లక్ష్మీనారాయణ

Image
తెలంగాణ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ  చైర్మన్గా  ఆర్యవైశ్య నాయకుడు  అమరావతి లక్ష్మీనారాయణ  ను సిఎం కేసీఆర్  నియమించారు.

తెలంగాణ టూరిజమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ఉప్పల శ్రీనివాస్ గుప్త గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.... భూపతి రాజు ఎడిటర్ :భూపతి టైమ్స్, గూఢచారి

Image
  తెలంగాణ టూరిజమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ఉప్పల శ్రీనివాస్ గుప్త గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.... భూపతి రాజు ఎడిటర్ :భూపతి టైమ్స్, గూఢచారి

ముగ్గురు ఎమ్మెల్సీల పేర్లు ఖరారు చేసిన మంత్రి వర్గం. గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్

Image
ముగ్గురు ఎమ్మెల్సీల పేర్లు ఖరారు చేసిన మంత్రి వర్గం.    ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది.

దుబ్బాక విజయంతో సమస్యల పై దూకుడు పెంచిన నల్గొండ బీజేపీ

Image
  దుబ్బాక విజయంతో   సమస్యల పై దూకుడు పెంచిన నల్గొండ బీజేపీ నల్గొండ: నల్గొండ పట్టణంలో  అకాల వర్షాలతో  దెబ్బతిన్న రోడ్లను  అధికార పార్టీ వారు  పట్టించుకోవడంలో విఫలం  చెందడంతో బీజేపీ నల్గొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ , పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి ఇతర నాయకులు కార్యకర్తలు  స్వయంగా రోడ్ల మరమత్తుకు పూనుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగుచేయలని లేనిచో భారీఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి గణేష్, బలరాం, నీరజ తదితరులు పాల్గొన్నారు

ప్రతి చివరి రైతుకు టోకెన్ అందచేస్తాం,రైతులు టోకెన్ ల కొరకు తొందర పడవద్దు, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

Image
ప్రతి చివరి రైతుకు టోకెన్ అందచేస్తాం రైతులు టోకెన్ ల కొరకు తొందర పడవద్దు, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్   నల్గొండ,నవంబర్ 12.సన్న రకం వరి ధాన్యం రైతులు టోకెన్ ల జారీ కొరకు తొందరపడ వద్దని,ప్రతి చివరి రైతుకు టోకెన్ లు అందచేస్తామని, మద్దతుధరకు ధాన్యం కొనుగోలు చేయానున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.టోకెన్ ల జారీ కి ఎటువంటి పరిమితి లేదని,రైతుల కు వచ్చే రెండు నెలలు వరకు టోకెన్ ల జారీకి వెసులుబాటు కల్పించ నున్నట్లు తెలిపారు.మిర్యాలగూడలో మిల్లులు సామర్థ్యం బట్టి ప్రతి రోజు మిల్లులు ధాన్యం దిగుబడి చేసుకొనే సంఖ్య లో టోకెన్ లు జారే చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు,అందరికీ ఒకే సారి టోకెన్ లు జారీ చేయడం సాధ్యం కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు టోకెన్ జారీ తర్వాత వరి కోత లు చేసి ధాన్యం తీసుకు రావాలని,వేచి ఉండకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. సన్నరకం ప్రైవేట్ రకాలు(జై శ్రీ రాం, చింటూ,హెచ్.ఎం.టి.,పూజ)తేమ శాతం తక్కువ ఉంటే మిల్లర్ లు కొనుగోలు చేయరని అపోహ ఉందని,రైతులు ఆరబెట్టుకొని 17 శాతం కన్నా తేమ తక్కువ ఉన్నా ధాన్యం మిల్లర్ లు కొనుగో...

దుబ్బాకలో బీజేపీ గెలుపు తెలంగాణలో బీజేపీ కి పెరిగిన ఆదరణ కు నిదర్శనం - నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి

Image
దుబ్బాకలో బీజేపీ గెలుపు   తెలంగాణలో బీజేపీ కి పెరిగిన ఆదరణ కు నిదర్శనం అని తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అన్నారు.  టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసి పోలీస్ లను తమ కార్యకర్తల పై వుపయోగించిన ప్రజలు బిజెపిని ఆదరించారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అన్నారు. దేశంలో కూడా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని నరేంద్ర మోడీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని,వచ్చే  గ్రేటర్ హైదరాబాద్ మరియు శాసన సభ ఎన్నికలో బీజేపీదే విజయం అని ఆయన అన్నారు. బీజేపీ కార్యాలయంలో పెద్దఎత్తున బాణసంచా కాల్చారు.కార్యాలయంలో   స్వీట్స్ పంపిణీ చేశారు.కార్యాలయం నుండి పెద్దఎత్తున కార్యకర్తలు సుభాష్ బొమ్మ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి,గోలి మధుసూదన్ రెడ్డి,నిమ్మల రాజశేఖర్ రెడ్డి,పోతేపక లింగస్వామి,శ్రీనివాస్ రెడ్డి,కంచర్ల విద్యాసాగర్ రెడ్డి,కూతురు లక్ష్మ రెడ్డి,చింత ముత్యాలరావు,షేక్ పాషా,కొండ భవాని ప్రసాద్,నీరజ, కాశమ్మ,విజయలక్ష్మి,తథితరులు పాల్గొన్నారు.  

సన్నరకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 2500 క్వింటాలు కు చెల్లించాలని బీజేపీ రాస్తా రోకో, ధర్నాలు

Image
సన్నరకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 2500 క్వింటాలు కు చెల్లించాలని  బీజేపీ  రాస్తా రోకో, ధర్నాలు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూచన మేరకు  శనివారం రోజు  నల్లగొండ జిల్లా లోని అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో  సన్నరకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 2500 క్వింటాలు కు చెల్లించాలని,కాలయపన లేకుండా 24 గంటల్లో రైతులు తీసుకువచ్చిన ధ్యానం ను కొనుగోలు చేయాలని,రైస్ మిల్లర్లు మోసం చేయకుండా ,రైతులను కాపాడాలని, డిమాండ్ చేస్తూ రాస్తా రోఖో,RDO కార్యాలయాల వద్ద ధర్నా, శాంతియుత ఆందోళన కు జిల్లా అధ్యక్షుడు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి  పిలుపు నిచ్చారని జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేకేర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో రైతులతో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చెయ్యాలని పార్టీ శ్రేణులను కోరారు.

గాంధేయ పద్ధతులో నిరసన తెలుపుతుంటే అరెస్టులు సిగ్గుచేటు-జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, నిమ్మల రాజశేఖర్ రెడ్డి

Image
గాంధేయ పద్ధతులో నిరసన తెలుపుతుంటే అరెస్టులు సిగ్గుచేటు-జిల్లా బీజేపీ  ప్రధాన కార్యదర్శి, నిమ్మల రాజశేఖర్ రెడ్డి నల్గొండ : తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ ధోరణి కి అప్రజాస్వామిక పద్ధతులను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త గంగలశ్రీనివాస్ ఆత్మహత్య కు నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టినందుకు నల్లగొండ జిల్లాలో  భారతీయ జనతా పార్టీ నాయకుల అరెస్టులు  శోచనీయం. ప్రజాస్వామ్యములో కనీసం నిరసన తెలిపే హక్కు కూడా తెలంగాణ ప్రభుత్వం లేకుండా చేయడం సిగ్గుచేటు. జిల్లాలో పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా ప్రవర్తించి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం అప్రజాస్వామిక  చర్య. గాంధేయ పద్ధతులో నిరసన తెలుపుతుంటే అరెస్టులు సిగ్గుచేటని, భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా కండిస్తుందని నల్లగొండ జిల్లా బీజేపీ  ప్రధాన కార్యదర్శి, నిమ్మల రాజశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

గంగుల శ్రీనివాస్ కు ఘనా నివాళి బీజేపీ నల్గొండ పట్టణ శాఖ.

Image
గంగుల శ్రీనివాస్ కు ఘనా నివాళి బీజేపీ నల్గొండ పట్టణ శాఖ.   నల్లగొండ పట్టణంలోని స్థానిక పెద్ద గడియారం సెంటర్ లో బీజేపీ నల్లగొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీనివాస్ మృతి కి సంతాపం గా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్ నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఏదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ మృతి చెందడం చాల భాదాకారం అని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దని రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రo లో బీజేపీ ప్రభుత్వ ఏర్పడుతుంది అని కార్యకర్తలు ప్రభుత్వం తీరును ఏప్పటికప్పుడు ఏoడగట్టాలని అన్నారు అలాగే గంగుల శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని అన్నారు నల్గొండ భారతీయ జనతాపార్టీ పట్టణ శాఖ బీజేపీ నాయకులు కార్య కర్తలు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మోరిశెట్టి నాగేశ్వర్ రావు , పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్, జిల్లా...