Posts

Showing posts from December, 2019

మూలాలు తెలియని నేటి తరం

మూలాలు తెలియని నేటి తరం, ఇదే ఈరోజు ఆంధ్ర పుట్టి ముంచిన శాపం…! నిజమేరా అన్నింటికీ మూలం అంటారు. కానీ, ఆ నిజం వెనుక మనం నమ్మే నిజాన్ని మించిన నిజం ఉంటుంది అని మనం గ్రహించమలేము. సూర్యుడు భూమికి తూర్పున ఉదయిస్తాడు అన్నది మనం నేర్చుకున్న నిజం. కానీ, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అసలు వాస్తవం. ఇలా మనం నమ్మే ప్రతి నిజం వెనుక మనకు తెలియని తర్కం ఒక్కటి ఉండొచ్చు. ఆ వాస్తవాల్ని గ్రహిస్తే, మన జీవితాలే కాదు, మనము నిర్మించుకుని నివసించే సమాజం కూడా వేరేగా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. మరి ఆ 'వాస్తవాన్ని' గ్రహించలేని, అంగీకరించలేని స్థితిలో నేడు మన తెలుగు ప్రజలు ఉన్నారా అంటే, ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పాలి. తెలుగునాట 'టెక్నికల్ ఎడ్యుకేషన్' కి ప్రిఫరెన్స్ పెరిగి, రెసిడెన్షియల్ సిస్టమ్ లో 'కోళ్ల ఫారా'ల తరహా విద్యార్థి ఉత్పాదన పెరిగాక వింత జనరేషన్ లు పుట్టుకొచ్చాయి. వీరికి ఏ విషయం పైన అయినా ఎవడో కనిపెట్టిన ఫార్ములాని థియరీని అనుసరించి, సొల్యూషన్ చూపించి, 'హెన్స్ ప్రూవ్డ్' అని ఏదోలా చూపించి, పైకి దేక్కుంట, పాకటం తప్ప, దాని వెనక పూర్వాపరాలు కానీ, వివరాలు తెల్సుకోవాలన్న ...

హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలి

ఏపీఎండబ్ల్యూఓ నాయకుల డిమాండ్... గూడూరు, సుదినం న్యూస్. గూడూరు : హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలని, గల్ఫ్ తరహాలో శిక్షలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రవూఫ్, జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ మగ్ధూమ్ మొహిద్దీన్ లు డిమాండ్ చేశారు. స్థానిక కటకరాజావీధిలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ  భారతదేశంలో ప్రతి 15 సెకండ్లకు ఓ ఆడపిల్ల మానవ రూపంలో ఉన్న మృగాల దాడికి   గురవుతోందన్నారు.  ఒకరోజున  సగటున 92 సంఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన తాజా నివేదిక అన్నారు. అలాగే గడచిన 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మూడు లక్షల 59వేల 349 మంది పై అత్యాచార దాడుల కేసులు నమోదైనాయన్నారు. అందులో అత్యధికంగా యూపీలో 56 వేల పదకొండు కేసులు నమోదైనట్లు వెల్లడించారు.  ఇది చాలా దారుణమన్నారు.  9 నెలల పసికందులను కూడా పొట్టన పెట్టుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.   మొన్న శంషాబాద్ లో జరిగిన ప్రియాంక రెడ్డి ఘటన,...