ఇసుక మాఫియా ఆగడాల పై ఉక్కుపాదం మోపుతున్న నందిగామ సబ్ డివిజన్ పోలీస్
ఇసుక మాఫియా ఆగడాల పై ఉక్కుపాదం మోపుతున్న నందిగామ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు..
అర్ధరాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణా చేస్తే వాల్టా కేసులు నమోదు చేస్తామని అలాగే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరిస్తున్న పోలీసులు..
ఒకవైపు ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంటే, మరొకవైపు అర్ధరాత్రి ఇసుక ఓవర్ లోడుతో అక్రమ రవాణా చేస్తున్న వైనం
ప్రభుత్వం నిర్దేశించిన సమయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రవాణా చేసుకోవచ్చని తెలిపిన కూడా ఈ అక్రమ రవాణా ఆగని పరిస్థితి...
రెవిన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఇచ్చే వే బిల్లు తీసుకొని ఆ వే బిల్లుతో వారు నిర్దేశించిన సమయంలో మాత్రమే ఇసుక రవాణా చేసుకోవాలి కానీ ఆ బిల్లు తీసుకున్న ఇసుకమాఫియా వారికి ఇష్టం వచ్చిన సమయంలో రవాణా చేస్తుంటే బిల్లు ఇచ్చే ఉన్నారు కానీ పరిశీలించేవారు మాత్రం కరువయ్యారు..
అక్రమార్జనకు అలవాటుపడి నియమ నిబంధనలు తుంగలో తొక్కి డబ్బు సంపాదించడానికి ఎన్ని అడ్డదారులు అయినా వెతుకుతున్న ఇసుక మాఫియా..
అర్ధరాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణా చేసి రాత్రికి రాత్రి వేలకు వేలు లక్షలు లక్షలు సంపాదించవచ్చని దురుద్దేశంతో అర్ధరాత్రి సమయంలో ఇసుక రవాణా చేస్తున్న 15 టిప్పర్లు సీజ్ చేసిన పోలీస్ అధికారులు
నందిగామ డి.ఎస్.పి జి.వి రమణ మూర్తి నేతృత్వంలో నందిగామ రూరల్ సిఐ సతీష్ మరియు కంచికచర్ల ఎస్సై శ్రీ హరి బాబు వారి సిబ్బందితో కలిసి కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద అర్ధరాత్రి సమయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓవర్ లోడ్ తో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 15 టిప్పర్ లను పట్టుకున్నారు..
పట్టుకున్న టిప్పర్ లను మైనింగ్ అధికారులకు సమాచారం తెలియజేసి వారికి అప్పగించారు..
Comments
Post a Comment