మరికొద్ది గంటల్లో ఈ ఐఫోన్‌లు పనిచేయవు

మరికొద్ది గంటల్లో ఈ ఐఫోన్‌లు పనిచేయవు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు ఐఫోన్‌ 5 వాడుతున్నారా అయితే మరి కొద్ది గంటల్లో మీ ఫోన్లు పనిచేయటం ఆగిపోనున్నాయి. అంతేకాదు ఇకమీదట మీరు ఏ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోలేరు. మీ ఫోన్‌లో డేట్‌, టైం, జీపీఎస్‌ లోకేషన్‌ కూడా అప్‌డేట్ కావు. వీటితో పాటు ఐక్లౌడ్‌, మెయిల్స్‌, వెబ్‌సైట్స్‌ ఓపెన్‌ కావని యాపిల్‌ పేర్కొంది. ఎందుంకంటారా... ఐఓఎస్‌ 10.3.4 ఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకోని యూజర్స్‌ ఫోన్లలో ఈ తరహా ఫీచర్స్‌ పనిచేయవని యాపిల్ తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలలోపు ఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకోలేవాలి. ఆ సమయం లోపల అప్‌డేట్‌ చేసుకోలేని వారు తమ ఫోన్‌ని కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేసి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.  yg. yv 
అంతేకాకుండా సెల్యూలార్‌ చిప్‌ ఉన్న ఐఫోన్‌ 4, ఐపాడ్‌ మినీ, ఐపాడ్‌ 2, మూడో తరం ఐపాడ్‌ మోడల్స్‌ వాడుతున్న వారు ఐఓఎస్‌ 9.3.6ను అప్‌డేట్‌ చేసుకోవాలి. లేకుంటే ఆ డివైజ్‌లలో జీపీఎస్‌ లోకేషన్‌ సర్వీసులు పనిచేయవని యాపిల్ తెలిపింది. చాలా మంది ఐఫోన్‌ యూజర్స్‌ కొత్త సాఫ్ట్‌వేర్‌ని వాడుతున్నప్పటికీ కొన్ని యాపిల్‌ సర్వీసుల్ని పొందాలన్నా, ఎయిర్‌ పాడ్‌ వంటి ప్రో వంటి ఉత్పత్తులకి తమ ఫోన్‌కి కనెక్ట్‌ చెయ్యాలన్నా ఈ తరహా అప్‌డేట్‌ తప్పనిసరని యాపిల్ తెలిపింది.
తమ పర్యావరణ విధానంలో కంపెనీ యాపిల్ ఉత్పత్తుల్ని మొదట కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి తరువాత కొనుగోలు చేసిన వ్యక్తి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఉపయోగించాలని పేర్కొంది. కానీ ఇప్పటికి  2012 కన్నా ముందు ఉత్పత్తుల్ని కూడా కొందరు వినియోగిస్తున్నారు. ఆ కారణంగా తలెత్తున్న జీపీఎస్‌ లోకేషన్ సమస్యలను పరిష్కరించటం కోసం ఐఓఎస్‌ 10.3.4, 9.3.6లను తీసుకొచ్చారు. అయితే వైఫై ఫీచర్‌ ఉన్న ఐపోడ్‌ టచ్‌, ఐపాడ్‌ మోడల్స్‌తో ఎటువంటి ప్రభావం ఉండదని యాపిల్‌ తెలిపింది


Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్