"వాటికి ఓకే అంటే.. యూనియన్లను రద్దు చేసుకుంటాం’’
''వాటికి ఓకే అంటే.. యూనియన్లను రద్దు చేసుకుంటాం''
హైదరాబాద్: సీఎం కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని, సమ్మెను విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కార్మికులను బెదిరించే ధోరణిలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. కార్మికులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. కార్మికుల ఉద్యోగాలు తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరిస్తే యూనియన్లు రద్దు చేసుకుంటామని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఇప్పటికైనా చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఈనెల 5న నిర్వహించతలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Comments
Post a Comment