Posts

Showing posts from November, 2019

*తహశీల్దార్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటిన దుండుగుడు*

*తహశీల్దార్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటిన దుండుగుడు*   రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. ఆమెకు కాపాడాటానికి ప్రయత్నించిన పలువురు కూడా గాయాల పాలయ్యారు. కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. తొలుత తహశీల్దార్‌తో మాట్లాడటానికి లోపలికి వెళ్లిన దుండుగుడు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని గౌరెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితులపై కఠిన చర్యలు..  తహశీల్దార్‌ దారుణ హత్య విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిందితులు ఎవరైనా చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలి అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చి సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలే తప్ప అధికారులపై ఇలాంటి చర్యలు చేయడం దారుణమని అన్నారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకుని అక్కడి...

మరికొద్ది గంటల్లో ఈ ఐఫోన్‌లు పనిచేయవు

మరికొద్ది గంటల్లో ఈ ఐఫోన్‌లు పనిచేయవు ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు ఐఫోన్‌ 5 వాడుతున్నారా అయితే మరి కొద్ది గంటల్లో మీ ఫోన్లు పనిచేయటం ఆగిపోనున్నాయి. అంతేకాదు ఇకమీదట మీరు ఏ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోలేరు. మీ ఫోన్‌లో డేట్‌, టైం, జీపీఎస్‌ లోకేషన్‌ కూడా అప్‌డేట్ కావు. వీటితో పాటు ఐక్లౌడ్‌, మెయిల్స్‌, వెబ్‌సైట్స్‌ ఓపెన్‌ కావని యాపిల్‌ పేర్కొంది. ఎందుంకంటారా... ఐఓఎస్‌ 10.3.4 ఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకోని యూజర్స్‌ ఫోన్లలో ఈ తరహా ఫీచర్స్‌ పనిచేయవని యాపిల్ తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలలోపు ఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకోలేవాలి. ఆ సమయం లోపల అప్‌డేట్‌ చేసుకోలేని వారు తమ ఫోన్‌ని కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేసి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.  yg. yv  అంతేకాకుండా సెల్యూలార్‌ చిప్‌ ఉన్న ఐఫోన్‌ 4, ఐపాడ్‌ మినీ, ఐపాడ్‌ 2, మూడో తరం ఐపాడ్‌ మోడల్స్‌ వాడుతున్న వారు ఐఓఎస్‌ 9.3.6ను అప్‌డేట్‌ చేసుకోవాలి. లేకుంటే ఆ డివైజ్‌లలో జీపీఎస్‌ లోకేషన్‌ సర్వీసులు పనిచేయవని యాపిల్ తెలిపింది. చాలా మంది ఐఫోన్‌ యూజర్స్‌ కొత్త సాఫ్ట్‌వేర్‌ని వాడుతున్నప్పటికీ కొన్ని యాపిల్‌ సర్వీసుల్ని పొందాలన్నా, ఎయిర్‌ పాడ్‌ వంటి ప్రో వంటి ఉత్పత్తులకి తమ ఫోన...

ఇసుక మాఫియా ఆగడాల పై ఉక్కుపాదం మోపుతున్న నందిగామ సబ్ డివిజన్ పోలీస్

ఇసుక మాఫియా ఆగడాల పై ఉక్కుపాదం మోపుతున్న నందిగామ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు.. అర్ధరాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణా చేస్తే వాల్టా కేసులు నమోదు చేస్తామని అలాగే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరిస్తున్న పోలీసులు.. ఒకవైపు ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంటే, మరొకవైపు అర్ధరాత్రి ఇసుక ఓవర్ లోడుతో అక్రమ రవాణా చేస్తున్న వైనం ప్రభుత్వం నిర్దేశించిన సమయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రవాణా చేసుకోవచ్చని తెలిపిన కూడా ఈ అక్రమ రవాణా ఆగని పరిస్థితి... రెవిన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఇచ్చే వే బిల్లు తీసుకొని ఆ వే బిల్లుతో వారు నిర్దేశించిన సమయంలో మాత్రమే ఇసుక రవాణా చేసుకోవాలి కానీ ఆ బిల్లు తీసుకున్న ఇసుకమాఫియా వారికి ఇష్టం వచ్చిన సమయంలో రవాణా చేస్తుంటే బిల్లు ఇచ్చే ఉన్నారు కానీ పరిశీలించేవారు మాత్రం కరువయ్యారు.. అక్రమార్జనకు అలవాటుపడి నియమ నిబంధనలు తుంగలో తొక్కి డబ్బు సంపాదించడానికి ఎన్ని అడ్డదారులు అయినా వెతుకుతున్న ఇసుక మాఫియా.. అర్ధరాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణా చేసి  రాత్రికి రాత్రి వేలకు వేలు లక్షలు లక్షలు సంపాదించవచ్చని దురుద్దేశంతో అర్ధరాత్రి సమయంలో ఇసుక ర...

"వాటికి ఓకే అంటే.. యూనియన్లను రద్దు చేసుకుంటాం’’

''వాటికి ఓకే అంటే.. యూనియన్లను రద్దు చేసుకుంటాం'' హైదరాబాద్‌: సీఎం కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని, సమ్మెను విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కార్మికులను బెదిరించే ధోరణిలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. కార్మికులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. కార్మికుల ఉద్యోగాలు తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరిస్తే యూనియన్లు రద్దు చేసుకుంటామని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఇప్పటికైనా చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఈనెల 5న నిర్వహించతలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

**టిటిడి సంచలన నిర్ణయం**

*టిటిడి సంచలన నిర్ణయం* అమరావతి : ఎపి ప్రభుత్వం జీవో నంబర్‌ 2323 ను జారీ చేసిన నేపథ్యంలో.. టిటిడి సంచలన నిర్ణయం తీసుకుని జీవో 2323 ని అమలు చేసింది. దీంతో ఒకే రోజు 140 మందికి ఉద్వాసన పలికినట్టయింది. శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్‌ శేషాద్రిని సైతం విధుల్లో నుంచి తొలగించింది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న రిటైర్డ్‌ అధికారులు, సిబ్బందిని తక్షణమే తొలగించాలన్న జీవో నెంబర్‌ 2323 ను అమలు చేసింది. దీంతో తిరుమలో పనిచేస్తున్న 140 మంది ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. 2019 మార్చి 31 కి ముందు నియమితులైన కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ ఈ జీవో వర్తించనుంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టిటిడి వర్గాలు చెబుతున్నాయి.

*అర్చన మార్కులు తక్కువ వచ్చాయి అని టీచర్ మందలించటంతో ఆసిడ్ కొని తాగి ఆత్మహత్యా యత్నం*

Image
ఖమ్మం: సత్తుపల్లి పట్టణంలోని సాంఘీక సంక్షేమ శాఖ సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉంటూ  10 వ తరగతి చదువుతున్న కోలా అర్చన(15) మార్కులు తక్కువ వచ్చాయి అని టీచర్ మందలించటంతో దగ్గరలోని షాప్ లో ఆసిడ్ కొని తాగి ఆత్మహత్యా యత్నం.  పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. అందుబాటులో లేని హాస్టల్ వార్డెన్.భయందోళనలో విద్యార్ధినులు..