Posts

Showing posts from October, 2019

ప్రజా వాణీ .కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర రావు,ఇతర అధికారులు

Image
ప్రజా వాణీ .కార్యక్రమంలో  ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర రావు,ఇతర అధికారులు

తుకమ్మ సంబరాలు లో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

Image
నల్గొండ పానగల్ వల్లభ చెరువు వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలు లో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ EE మున్సిపాల్టీ వెంకటేశ్వర్లు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి ఎమ్మార్వో దామోదర్ రెడ్డి ఇతర అధికారులు

*తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ*

Image
*తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ* నల్గొండ : బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దమని జిల్లా అదనపు ఎస్పీ టి. పద్మనాభ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. పువ్వులతో పూజ ప్రపంచ సంస్కృతి అని కానీ ఆ పువ్వులకే పూజ చేయడం తెలంగాణ అడబిడ్డలకే సొంతమని అన్నారు. యావత్ ప్రపంచంలో బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తం అయిందని చెప్పారు. తీరొక్క రంగుల పువ్వులతో గౌరమ్మగా బతుకమ్మను కొలుస్తూ తొమ్మిది రోజుల పాటు పువ్వుల పండుగ నిర్వహించుకోవడం అద్భుతమని పద్మనాభ రెడ్డి అన్నారు. 75 ఏండ్ల వయసులోనూ అదనపు ఎస్పీ పద్మనాభ రెడ్డి అత్తగారు ఎంతో ఉత్సాహంగా అందరిని ఉత్తేజ పరుస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలకు మరింత శోభను చేకూర్చారు. బతుకమ్మ సంబరాలలో ఆర్.ఐ.లు వై.వి.ప్రతాప్, నర్సింహా చారి, శంకర్, ఆర్.ఎస్.ఐ. వెంకట రాజు తో పోలీస్ సిబ్బంది కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మొక్కలను నాటిన జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్

హాలియా  మండలం హజారి గూడెం గ్రామం లో 30 రోజుల ప్రత్యెక  ప్రణాళిక లో బాగంగా  గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో  మొక్కలు నాటి,   ఏర్పాటు చేసిన  సమావేశం లో గ్రామస్తుల నుద్దేశించి మాట్లాడిన జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్,స్థానిక ఎమ్మెల్యే నోముల నరసింహాయ్య గారు  ఈ కార్యక్రమంలో  మండల పర్యవేక్షణ అధికారి వెంకటేశ్వర్లు ,మండల,గ్రామ  ఇతర అధికారులు  పాల్గొన్నారు